Srianjaneyam Sthuti

SRIANJANEYAM STHUTHI
పల్లవి: శ్రీ ఆంజనేయం అసమాన కాయం
అంజనీ తనయం అపురూప తేజం [2]
చరణం: దినకరుని ఫలమని తలచి నీవు
నింగికెగరి వరములె బడసితివి [2]
లోకపూజితము నీ అమృత భాషణము
రాముని హృదినే దోచిన ఘనుడవు [శ్రీ]
నీ శక్తి నీకు తెలియరాదు నిను
స్తుతియింపగ అంతట నీవు [2]
సకల లోకముల నుతులందేవు
వీరాధి వీరుడవు వీరాంజ నేయుడవు [శ్రీ]
చరణం: రాముని కార్యము అవలీలగా జేసి
హృదయమున రాముని నిలిపినావు [2]
సుందర కాండకు సుందరుడే నీవు
మహిమాన్వితము నీ పావన చరితము [శ్రీ]
కీర్తి యశస్సుకు మారు పేరుగా
నిను పూజించిన తిరుగులేదుగా [2]
అమృత మయుడవు అసమాన దేవుడవు
ఆర్తుల పాలిట కామధేనువు [శ్రీ]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link