Srilakshmi

SRI LAKSHMI
పల్లవి: శ్రీలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి
సిరులు కురిపించవే, తల్లి మహలక్ష్మీ [2]
చరణం: సకల సౌభాగ్యములు, కలిగించు తల్లివి
సద్గుణ, సంపదలు, పొందు వరమీయవే [2]
నిను గొలిచిన క్షణము, కరుణించి, మము నీవు
కనుసన్నల, కరుణ, కురిపించవే తల్లి [శ్రీ]
చరణం: చిరు మందహాసముల, శోభిల్లు తల్లి
మందార మల్లికల అర్చింతుమే నిన్ను [2]
అరవిందుని రమణి, అలరారు చుండగా
అంగరంగ విభవముల వెలుగు తల్లి [శ్రీ]
చరణం: క్షీరాభ్ధి కన్యకవు, శ్రీ రామపత్నివి
సహన శీలమున అగ్రగామివి నీవు [2]
సకలా భీష్టములు నెరవేర్తువే నీవు
మనసు ఫలకము నందు, కొలువుండు జననీ [శ్రీ]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link