Srinivasudanta

SRINIVASUDANTA
పల్లవి: శ్రీనివాసుడంట, అమ్మలాలా వాడు
సిరులిచ్చు, శ్రీ పతంట, అమ్మలాలా [2]
అ.ప: ఏడేడు కొండలెక్కి, ఏడేడు లోకాలు
పాలించునంట, అమ్మలాలా [శ్రీ] [2]
చరణం: అందరిని కాచేను, ఆదుకొని బ్రోచేను
అందరి వాడంట అమ్మలాలా [2]
సత్య భాషణల, సత్య మార్గముల
నడుపు దైవమట, అమ్మలాలా
యుగయుగాలకు, ప్రతిమనమ్మున
నిలచు దేవుడట, అమ్మలాలా [శ్రీ]
చరణం: ఆలుమగల మధ్య అన్యోన్యతకు
ఆదర్శ ప్రాయుడంట, అమ్మలాలా [2]
ఎన్నెన్ని లోకాలు, వెదికి చూసినను
అటువంటి దైవమె కానరాడంట [2]
యుగ యుగాలకు, ప్రతి మనమ్మున
నిలచు దేవుడట, అమ్మలాలా [శ్రీ]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link