Jagamu Nijamu

JAGAMU NIJAMU
పల్లవి: జగము నిజము, జనులు నిజము
హరిని తలచగ నేల సంశయము! "2"
చరణం: ఝరులు నిజము, తరులు నిజము
కరుణా సాగరుని, కరుణ నిజము "2"
మాయ నిజము, మంత్రమునిజము "2"
మహీధరుని మహిమలు నిజము
నిజము, నిజము "జగము"
చరణం: విరులు నిజము, తావి నిజము
నిజము విరి తావులలో మకరందము "2"
హృదయలయలో, హరియే తావిగ "2"
తరియించు జనుల, మనుగడయె నిజము
నిజము, నిజము "జగము"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link