Jayathu

JAYATHU
పల్లవి: జయతు, జయతు, ఓ భాగవతోత్తమా!
జయము నీకు ఓ పురుష పుంగవా! "2"
చరణం: తిరుగాడెను, తిరు వేంకట రమణుడు
తిరు మాడ వీధుల మోహినీ రూపమున
రామ చిలుకను, కరమున ధరియించెను
మన అసువులు, ఎన్నడెగురునో ఎరుగములే!
మనలోన ప్రాణము ఉన్నంత వరకు
తగినంత సత్కర్మలు చేయవలె
అనుజ్ఞ నొసగెను, ఆ అంతర్యామి
మరువకుమా! ఓ మానఓత్తమా! "జయతు"
చరణం: చేతనగునంత చేయి సహాయము,
తిలకించు నగవులు, వారి నగుమోముల "2"
దీవించు నిన్ను ఎల్ల వేళలా అన్నిటికన్న
అవిఎంతయోమిన్న దీవించునిన్ను ఎల్లవేళలా
జేర్చును నిన్ను ఆ దైవ సన్నిధి "జయతు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link