Jeevathma

JEEVAATHMA
పల్లవి: జీవాత్మ, పరమాత్మ ఒకటేరన్నా!
ఇక నేనను, నీవను బేధమె లేదు, లేదన్నా "2"
అ.ప: పరమాత్మను నీవు, నీలోన కనరన్నా
పరతత్వమంటూ ఎచటనో లేదన్నా
ఓలాలా, ఓలాలా, ఓలాలా..."జీవాత్మ " "2"
చరణం: నీ సాటివారితో సఖ్యతగా నువు మనుమన్నా
నీ తోటివారినీ ప్రేమించుటయె, మరి మిన్నన్న
సాటి జీవులపై కనికరము కనరన్నా!
నీపాటికి నీవేవుండుట, ఇకమరి తగదన్నా "జీవాత్మ" "2"
చరణం: అన్నెం, పున్నెము, ఎరుగని ఈతరువులపై జాలిచూపన్నా!
నీ ఆత్మకు సాక్షివి నీవేరా! ఓరన్నాఇదిఎరుగన్నా
నీ ఆత్మ శోధనయె పరమాత్మను జేర్చన్నా
అదియే సుఖము, ఇలలో ఇతరము యిక లేదన్నా "జీవాత్మ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link