Kalimi Lemulu

KALIMI LEMULU
పల్లవి: కలిమిలేములు, సమమని భావించి "2"
ఇలనుమనిన, ఆనరుడే, మహనీయుడు "2"
చరణం: పురుషాధముడవని, భావించిన నిన్నే "2"
పురుషాగ్రశ్రేణివని, పొగడుదురె! జనులు "2"
కలిమిలేములను, త్రాసున నిలబెట్టి "2"
కొలచి, కొలచి, వేధింతురయ్యా నిన్నే!
ఈ నరులు, యిలనరులు "కలిమి"
చరణం: కలిమియందుననే, కలదంటు సుఖము
తలచిన వారంతా, మరలెదరు, దిక్కును "2"
కలిమిలేములు, దేవుని చేతలని "2"
తెలియనివారె చేసెదరయ్యా మాయను
ఈనరులు, యిలనరులు "కలిమి"
చరణం: కలిమిలేములే, వెలుగు తిమిరముల "2"
జోడియని, నమ్మే, మనుజులె నిక్కము "2"
లేమియందుననూ, తనవారిగ తలచుకొని "2"
మెలగినవారే, జగమున నిజమగుబంధము "కలిమి"
చరణం: ఇహమున, నిజకలిమి పద్మనాభుడని "2"
ఎరుగని వారేలే, కడలేని లేమియని
ఎరిగిన ఆనాడు, పరమగును, యిహము "2"
ఎరుగనినాడు, కనలేము, యిలపరము "కలిమి"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link