Janana Jeevana

JANANA JEEVANA
పల్లవి: జనన జీవన చక్రమందున "2"
ఇరుసు తానై ఇలను ఏలును
అ.ప: యుగముల దైవము, శ్రీ హరి తప్ప
వేరొక దైవము లేనే లేడు "జనన" "2"
చరణం: జీవన సంద్రము ఈదుటలో
పలు రేఇంబవళ్ళు గడచినవి "2"
మనసు మరల్పు సమయమున "2"
వయసుడుకు వేళలు, సమీపించినవి స్వామీ!
నిను జేరు వేళలు దగ్గరైనను "2"
ఇహలోక వాంఛల, మునిగితినయ, నేను "జనన"
చరణం: కూపస్థ మండూక చందమున
సంసార కూపమున మునిగితిని "2"
భువి పైన జన్మ లెన్నున్న "2"
మానుష జన్మము పరమోత్తమము, స్వామీ!
మరుజన్మ కైనను, నీ స్మరణయె తప్ప "2"
అన్యము ఎరుగక, యత్నింతునయా! "జనన"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link