Manchi Chedulatho

MANCHI CHEDULATHO
పల్లవి: మంచీ చెడులతో, మనును జీవనము
కాలగమనమున, అవియును మారేను
అ.ప: హరి తలపే, మన నిజమగు ధనము
ఎంత తలచిన అది, అంత పెరిగేను "2" "మంచీ"
చరణం: కన నీకు మిగుల మంచి యనునది చేదుగ
దోచేను, అదియే నాకు పలువురకు మేలు సేయునన్నదే
మంచియని తోచవలె, నీకును, నాకును మంచీ చెడుల
తర్కము వ్యర్ధము కాల సమయములు, మరలుట
కష్టము అల మాధవుని, సేవించుటనున్న, సుఖము
అన్నిటను, మించినది ఓరన్న "2" "మంచీ"
చరణం: కాలమాన స్థితిగతులు మారినను మంచియె
నిలచును, కలకాలము మహిమలు ఎన్నో, సృష్టి చేతలో
నగధరుని స్మరణే నిలువగ మనలో మంచీ చెడుల,
వివరణ కష్టము అచ్యుత సేవనమే, సులభ మార్గము
ఏలచింత యిలలోన ఇక మనకు కొలచిన మేలగు ఓరన్నా "మంచీ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link