Mangalam Uragasayanaku

MANGALAM JAYA MANGALAM
పల్లవి: మంగళం, జయమంగళం మాఉరగ శయనకుమంగళం [2]
అ.ప: మంగళం శుభ మంగళం శ్రీదురిత దూరికి మంగళం [2]
చరణం: రక్కసులను, మట్టు గరిపెడి, నందకమునకు మంగళం
గొల్లతల్లుల, మనము లందలి, పిల్ల గ్రోవికి మంగళం
మంగళం శుభ మంగళం గోపాలబాలుకు మంగళం [మంగళం] [2]
చరణం: కాళీయుని దర్పమణచిన వనజ విభునకు మంగళం
ఎల్లవేళల, కన్నుకాచే కోమలాంగుకు మంగళం
మంగళం శుభ మంగళం గోవర్ధనునకూ మంగళం [మంగళం] [2]
చరణం: సర్వ నిలయుడు, మోహనాంగుడు పరమయోగికి మంగళం
క్షీరమధనుని మానసమ్మున వీక్షణమునకు మంగళం [2]
మంగళం శుభ మంగళం మాపద్మనాభుకు మంగళం [మంగళం] [2]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link