Naarayana

నారాయణ
పల్లవి: నారాయణ, శ్రీమన్నారాయణ [2]
నారద ప్రియనే, నారాయణ [2]
అ.ప: నారాయణ, లక్ష్మీనారాయణ [2] [నారాయణ]
చరణం: దేవకి నందన, భవభయభంజన
ఆత్మానందా, గోవిందా [2]
పరమాత్మనే, శ్రీపంకజనాభ
కరుణామూర్తి, జై గోవిందా [2] [నారాయణ]
చరణం: దురిత విమోచన,సిరిపాలక ప్రియ
పాహిమురారే, గోవిందా [2]
ఆశ్రితవత్సల, ఆపద్బాంధవ
అభయ ప్రదాతా, జై గోవిందా [2] [నారాయణ]
చరణం: త్రేతాయుగమున, సాకేత రామా
ద్వాపరమందున, గోపాలా [2]
కలియుగమందున, వేంకటరాయా
అవనిని, కాయు జై గోవిందా [2] [నారాయణ]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link