Mathayashodaa

MATHAYASHODAA
పల్లవి: మాత యశోద, ముద్దుల బిడ్డడు
మాయాసురులను, దునుమక మరలడు, "2"
అ.ప: దుష్టులపాలి సింహ స్వప్నము
శిష్టుల కన్నుల పున్నమి చంద్రుడు "మాత"
చ: శకటాసురుని దన్నిన పదములు నొప్పిగొనినవా! చక్కని స్వామీ
పూతన, ప్రాణములు హరియించిన నీనోరు, నొప్పిగొనినదా! స్వామి
నవనీతము, నోరార భుజియించి సేదతీరుమా! పన్నగ శయనా! "2"
దుష్ట కంసుని హత మార్చిన నీ చిన్ని కరములు కందినవా!?
దీనుల కభయము లీయగ, కరములు కల్యాణ కారకమవునుగా "మాత"
చ: యశోదమ్మ నినురోటను గట్టగనడుముమిగులగ, నొచ్చినదా! స్వామి!
కుబేరపుత్రులు, వృక్షరూపులశాపము బాపినపురుషపుంగవా! "స్వామీ"
ముల్లొకములూ పాలించెడివాడు వైకుంఠిని సరిదైవమెలేడు "2"
అల దైవముకును, యిలసైతం, మరి, భాదలు,గాధలు తప్పినవా!?
అయిన నాతడు, చలించక జగతిని రక్షించి, కాపాడునుగా! "మాత"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link