Nama Matruda Nenu

నామమాత్రుడ నేను
పల్లవి: నామ మాత్రుడ నేను,
నామాంకితుడవు, నీవు, హరీ! "2"
అ.ప: మధురామృతము బ్రోలు నీ నామామృతము
గ్రోలగ, మా జన్మ ధన్యము "నామ"
చరణం: అనుకూల, ప్రతికూల సమయమందునను, స్వామీ!
ఎంచక మానవ తప్పిదములను "2"
అసామాన్య, కరుణను కురిపించి
మమ్ముల గాచిన, ఆది దైవమా! "నామ"
చరణం: తలచిన వారలకు, తలచిన విధములుగ
వరముల నందించు, పురుషొత్తముడవు నీవు
తరతరాలకు లోటిడని దైవము "2"
భక్తులముంగిట నోముల పంటా! "నామ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link