Nadhude

NAADHUDE
పల్లవి: నాధుడె జగన్నాధుడే జగతి కంతయు,
ఈతడె ఆధార భూతుడు నాధుడె, జగన్నాధుడీతడు "2"
చరణం: పదునాల్గు భువనములు, పాలించు ఱేడు
పది అవతారములు, దాల్చినవాడు "2"
దిగ, దిగంతములు, తానైన వాడు
దీన జనులకు దిక్కైనవాడు "నాధుడె"
చరణం: ఆర్త పరాయణుడు, శ్రీ ప్రియవల్లభుడు
ఆర్తుల పాలిటి ఆపద్భాందవుడు "2"
జనార్ధనుడు, జగములకే విభుడు
జగదోద్ధారకుడు, జగన్నివాసుడు "నాధుడె"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link