Chirumandahasam

LYRICS: CHIRUMANDAHAASAM
పల్లవి: చిరుమందహాసం, శివ మందహాసం
సుమదరహాసం, మధురాతి మధురం ఓంనమః శివాయ "4"
చరణం: తామసములన్నియు, తొలగించు హాసం
తామరపూవు వలె, వికసించు హాసం
తాపత్రయాగ్నులు, శమియించు హాసం
తాపసుల మనముల, వశియించు హాసం
ప్రమధగణములను, శాసించు హాసం
ప్రధమ దేవునిగ, నుతులందు హాసం
భువనేశ్వరిమదిన, నిలచినహాసం
భువనములపాలించి, లాలించుహాసం ఓంనమః శివాయ "4"
చరణం: సోముని శాపము, తొలగించు హాసం
ముక్కంటి హాసం, మృదుమంద హాసం
చక్కని స్వామికి, చక్కనైన హాసం
లోకములన్నియు, శివహాస లాలసం
కైలాసుని మోము, కళలొలుకు హాసం
కామిత మోక్షములు, దీర్చును హాసం
క్షేమయోగములు, సిద్ధించుహాసం
ఏకామ్రేశ్వరుని, ఏకైకహాసం ఓంనమః శివాయ "చిరు" "4"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link