Esumantha

పల్లవి: ఇసుమంత తలచిన, ఎంతటి భాగ్యము
ఇంతటి దైవము, ఎంతైనను, కనలేము "2"
అ.ప.: అంతట తానైన, ఆది బ్రహ్మ రూపము
కొంతతలచినను,అందించును మరిఘనము "ఇసుమంత"
చరణం: ఎంత వెదకిన, కానగ దుర్లభమైనను
వెదకిన తావుల వెదకితి "2"
తెలుసుకొంటిని, జగతియంతయు వ్యాపించిన విభుని "2"
నగధరుడేయని, గోవిందుడేయని "ఇసుమంత"
చరణం: "సుంత"యును లేడను వారి దర్పముల
నంతయు, జగమంతనిండె, జగన్నాధుడు "2"
"ఎంతో" అయినహరిని, ఇంతయని వర్ణింప సాధ్యమా! "2"
సిరి వరుడే యని, శ్రీ శ్రీనివాసుడని "ఇసుమంత"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link