Enduko Namansu

ENDUKO NAMANASU
పల్లవి: ఎందుకో నా మనసు, ఎదురు సూత్తున్నాది
ఎల్లలేలేని సామి, ఎదురుగ వత్తాడని "2"
హైలెస్సో, హైలో, హైలెస్సా "ఎందుకో" "2"
చరణం: సెట్టు, సేమలు అన్నీ, ఎదురు తెన్నులు కాసే
సేతితో నా సామి, తాకగ మురిసేను "2"
నోరులేని జీవులన్నీ, కళ్ళు ఇల్లు సేసుకొని "2"
సామిరాక కోసమే, ఎదురు సూత్తున్నవి
హైలెస్సో, హైలెస్సా "ఎందుకో" "2"
చరణం: ఏటిలోని సేపలన్ని, నీరుగారి పోయినవి
నీరాక కోసమై, సిక్కవు వలలోన "2"
కొండలన్నీ, నీ రాకకై బండ బారి పోయినవి "2"
నీ రూపు దాల్చుటకూ, నీ సేవ సేయుటకూ
హైలెస్సో, హైలెస్సా "ఎందుకో" "2"
చరణం: మణిసై పుట్టినాను, నీసేవ కోసమే
నిన్నేల మరిసేనూ, నీకై మసలేను "2"
నాసామి, నీకేమి, బదులుగ యిచ్చేను
నామనసు నీకెపుడో, నైవేద్దె మాయెను హైలెస్సో "2"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link