Ee Jagamu

ఈ జగము విష్ణుమయము
పల్లవి: ఈ జగము, విష్ణుమయము
నిగమాగమము, శ్రీవిష్ణుపధము [ఈ జగము]
అ.ప: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకం [2][ఈజగము]
చరణం: భక్తాగ్రేసరుడు, మాఅన్నమయ్య
చేసెను, సర్వముదైవాంకితమయ [2]
కీర్తనలనే పూమాలగా జేసి [సంకీర్తనలనే]
శ్రీపతినలరించి, తరియించె నయ్యా [ఈజగము]
చరణం: గోపన్నస్తుతియించె, రామన్నపదము
చేపట్టె, ఆలయనిర్మాణము [2]
పొందెను, గోపన్న కారాగారము
రచియించె, శ్రీరామ సంకీర్తనలు [ఈజగము]
చరణం: శ్రీత్యాగరాయ, శ్రీరామదేవళా
శ్రీరామ సేవయె, మాణిక్య, మణులాయె [2]
సుఖదుఃఖములు, రాముని వరమనె
ఆద్యంతములు, శ్రీరామమయమనె [ఈజగము]
చరణం: పోతనవిరచితము, ఆంధ్రభాగవతం
కృష్ణలీలామృతమును, లోకానికందించె
కాసు, కనకములు, విడనాడెనయ్య
ఇహమోహములకు, అతీతుడాయెను [ఈజగము]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link