Dhaga Dhaga

DHAGA DHAGA
ఓంశంకరా! గరళ కంధరా! చంద్రశేఖరా! శివ,శివశంభో! "2"
పల్లవి: ధగ ధగ, ధగ ధగ ధవళ రూపమున
మెరిసెను, నగమున నటరాజం
ఢమఢమ, ఢమఢమ, ఢమరుకమ్మునూ,
కరమున మ్రోగెను, ఢమఢమ, ఢం "2"
కైలాసమున శివతాండవము తకధిమి,
తకధిమి, కదులగ పదములు "ధగ ధగ"
ఓంశంకరా! గరళ కంధరా! చంద్రశేఖరా! శివశివశంభో "2"
చరణం: హరిహర రూపమె, కైలాసనాధుడు
జగతికి ఆతడె, ఆధారభూతుడు "2"
స్థితి, లయములకు, మూలకారకుడు
వరము లొసగుటలొ, బోళానాధుడు "2"
పరవశాన శివతాండవం
ప్రమధ గణములకు పరవశం "ధగ ధగ"
చరణం: భవాని మోము, నిండినవి నగవులు
భువనైక విభుని ఆ నాట్యలీలలు "2"
సప్త సంద్రములు, ఉప్పొంగెనులే!
కాశీనాధుని తాండవ కేళికి "2"
నటరాజు ఆడె నర్తనం
ముల్లోకములకు సంతతం "ధగ ధగ"
ఓం శంకరా! గరళ కంధరా! చంద్రశేఖరా! శివ శివ శంభో "2"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link