Durapukondalu

దూరపు కొండలు
పల్లవి: దూరపు కొండలు నునుపని తెలిసి,
పరుగులు తీతువె ఓమనసా! "2"
చేరువనున్నహరినేమరచి,
భ్రమయే నిజమని తలచేవు "దూరపు" "2"
చరణం: సంద్రమునందునీటి బిందువు ఏలనో
తెలిసి ఈదుటకు, నువు సాహసించేవు, మనసా!
అందని దానికి చేతులు జాచిన మనసా! "2"
అందినది నువు, పొందలేవులే! మనసా "దూరపు" "2"
చరణం: పొందినదంతయు నీ భాగ్యమని తలచు
ఇక అందినదానిని అందముగా నువు మలచు
అసాధ్యమైనను, మలచుట నీవంతు మనసా
సరి చేయూతను ఒసగుట, తనవంతే మనసా! "దూరపు"
చరణం: వర్షించు జలము పొలముల పారిన
ఎండిన బీడులే పచ్చని పంటలవునులే మనసా!
ధనము, కాలము, వ్యర్ధము సేయకె మనసా!
నువు పలువురకు, మేలు సేయవే మనసా! "దూరపు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link