Alamelu Mangamma

అలమేలు మంగమ్మ
"పల్లవి": అలమేలు మంగమ్మ తలపుల నీవమ్మ
తలపలోక నిలయవట మా తలపుల వాకిట నీవట "అలమేలు"
"చరణం": పలుకుల తేనెలధారల పదముల మువ్వలు భళిరా!
పాలపొంగువోలె నవయవ్వన తారవు ఛాయవు "2"
పాలసంద్ర నిలయవు పరువాల వెల్లినీవు
పాలముంతల కొలువా పాల పుంతల ఛాయవా! "అలమేలు"
"చరణం": పూలవంటి పరిమళము మేని సొగసు అతివా!
తలవంచి సిగ్గుపడు పూల తోటలే మగువా! "2"
కిలకిల నగవుల మల్లెలు గుసగుసలాడేనులే!
అల్లనల్లన చందురుడే మబ్బులలో దాగెనులే! "అలమేలు"
"చరణం": అచ్యుతుడే నీవాడు అలమేలు మంగమ్మా!
మచ్చికతోడనె నీవు మనువాడినావమ్మా! "2"
అచ్చెరువందగ నీవు అలమేలు మంగాపురమున
నచ్చి వచ్చి నిలచినావు వరముల నిధివైనావు "అలమేలు"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link