Angaranga Vaibhavam

అంగ రంగ వైభవం
"పల్లవి": అంగ రంగ వైభవం రంగనాధునీ ఉత్సవం "2" "శ్రీ"
జగమంతా వీక్షణం మనసంతా వుత్సాహం "2" "అంగ"
"చరణం": ఏడురోజులు సాగే ఘనమైన వుత్సవం
ఏడేడు లోకములు వీక్షించే సంబరం "2"
ఏడేడు జన్మలు ముక్తినొసగు సంరంభం
ఏడుకాలాలు తిరముండు వుత్సవం "అంగ"
"చరణం": ఆనందం అద్భుతము మిళితమీ వుత్సవం
రంగనాధోత్సవం యిల బంగారు వుత్సవం
స్వర్గమే యిలపైన దిగునటుల వుత్సవం
కలనైనను కనివినీ ఎరుగనీ వుత్సాహం, ఆశ్ఛర్యం "అంగ"
"చరణం": ప్రతిమాఘమున జరుగును రంగని బ్రహ్మోత్సవం
ఆఘమేఘములపైన జనులు తరలు వుత్సవం
రంగనాధుడే మేఘము జనుల మనసు క్షేత్రము
కను జూపే జల్లు మనకు మోక్షమే విత్తనము "అంగ"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link