Damodarude

LYRICS:
దామోదరుడే
"పల్లవి": దామోదరుడే ధరణిని గాచేను
యిలలోన తామసము తరిమిగొట్టును "దామోదరుడే"
"చరణం": పావనమైన పాదద్వయము
తాకిన జాలును పారవశ్యము
సాయుజ్యము నిచ్చు సాకారుడు
ఆకాశమునిండి అనంతుడై ఇలవెలసినాడు "దామోదరుడే"
"చరణం": ఏమైనను మరి దామోదరుడే
సకలలోకపతి తరచికానగను "2"
అఖిల లోకముల ఏకనాయకుడు
అఖిల చరితముల చరితార్ధుడు హరీ! "దామోదరుడే"
"చరణం": ఆజ్యము లేనిదే దీపము వెలుగదు,
సాన్నిధ్యమేలేని, జీవము మనదు
అవ్యాజ కరుణల కరుణామయుడు
దివ్య మహిమల మహిమోపేతుడు హరీ! "దామోదరుడే"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link