Arogyam Anandam

LYRICS:
ఆరోగ్యము ఆనందము
"పల్లవి": ఆరోగ్యము ఆనందము అర్కుని మరి సేవించిన
ఆయుషు, ఐశ్వర్యం అర్కుని మరి అర్చించిన "2"
"చరణం": ఏడు అశ్వములపై విహరించే భాస్కరుడు
ఏడు లోకాలలో విహరించే ప్రభాకరుడు
ఏడు నదుల సంగమము కలిగించు ఆదిత్యుడు
ఏడవ తిధిలో మరి విహరించే దినకరుడు "ఆరోగ్యము"
"చరణం": దినకరుడు లేనిదే సృష్టి అసలు లేదులే!
సృష్టి లేనిదే మనము మనమను వారము కాములే!!
సృష్టి కారకుడు యీ సూర్యభగవానుడైతే!
స్థితి కారకుడు ఆ శ్రీమన్నారయణుడే "ఆరోగ్యము"
"చరణం": ఆరోగ్యము కలిగియున్న అదే మహాభాగ్యము, ఆ
భాగ్యము మనకిచ్చును, అఖిల జగ మార్తాండుడు
ఇనకులపు చిహ్నమై నిలచినాడు కిరణ్మయుడు
ఇనవంశపు దీపమై వెలిగినాడు రఘురాముడు "ఆరోగ్యము"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link