Kundapothaga

LYRICS:
కుండపోతగా
"పల్లవి": కుండపోతగా వానలు గురిసిన కొండలరాయుడే చిరుజల్లు
బండబారిన హృదయమందును భావములను మొలకెత్తించు "2"
"చరణం": చిల్లులుపడిన ఆకాశమును ఛత్రమువలె తను కాపాడు
గొల్లపిల్లడే గోవర్ధనముతో గోకులమంతయు గాపాడే
ఒక్కపదముతో భూమియంతయు అంతయు తానై ఆవరించెను
బక్క బాపడే బలి భూపతిని పాతాళమునకు పంపివేసెను "కుండపోత"
"చరణం": గాలిరూపమున గోవర్ధనుడు శరీరమంతా పులకరింపెను
ఆలిగ శ్రీమతి శ్రీమహాలక్ష్మిని హృదయమునందే నిలుపుకొనెనులే!
భాస్కరుడే మరి చిరుదివ్వెవలె లోకమంతయును వెలుగునిచ్చును
అర్కుడైననూ భూసురపతి ఘన చాయలే తన వెలుగులాయలే "కుండపోత"
"చరణం": సర్వలోకములు ఏలెడువాడు సర్వోత్తముడే, ఇంకెవరు
సర్వము తానై పరము నిచ్చును, సామీప్యము మరి తానేలే
సర్వాయుధుడు శుభకరుడు హరి, యుగపురుషుడు మరి తానేలే!
సర్వసంపదల మన వడి నింపు సర్వస్వము యిక తానేలే! "కుండపోత"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link