Anandam Neevele

ఆనందం నీవేలే!
"పల్లవి": ఆనందం నీవేలే! అద్భుతమైనావులే!
ఆనంద లోకాల అపురూప కాంతివిలే! "2"
అ.ప.": నీ కన్నుల కాంతిలోన పయనించే వారలము
నీ గాలిసోకిన మనసు ఆనంద పరవశము "ఆనందం"
"చరణం": నీ కొండలపైన పాదం నే మోపగనే
నా అండ నీవనే భావమే గల్గెనులే! (భావనయే)
నా గుండె సవ్వడియే గుడిగంట ఆయనులే! "2"
నా డెందము పులకితయై నవ నవోదయమాయెనులే! "ఆనందం"
"చరణం": నవోదయపు అరుణిమయె తిరునామమై మెరసెనులే!
నీ సుందర రూపమే నా హృదిలోన నిలచెనులే!
అందమైన అనుభూతియె ఆనంద నిలయమాయెనులే!
ఆనందనిలయమే తిరువేంకటపురమాయెనులే! "ఆనందం"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link