Atthivarada

అత్తి వరదరాజస్వామి
"పల్లవి": అత్తి వరదరాజస్వామి పెరుమాళ్ళు వందనం, నీవు
ఉత్తుత్తిగ యీయవుగా లెక్కకు మించిన వరములు "2"
"అ.ప.": ఒత్తి ఒత్తి పలికిన నీ నామ మహిమ గరిమను
పత్తిత్తులకైననూ వారి పంట పండును "అత్తి"
"చరణం": సత్యము నీవు గాక యింకెవరున్నారు!
నిత్యము నీ మహిమలు మనసారా గాతుము!
నిత్య సత్యములు నీవు పంచిన, పరమాన్నముగా!
అసత్య భాషణముల స్వామి సంతృప్తి చెందవుగా! "అత్తి"
"చరణం": అత్తి వృక్ష రాజమే నీ ఆకారము దాల్చెనుగా!
అత్తి వృక్షమే యిల ఘన పూజలందుకొనెనుగా!
స్థలాభోగ శిలాభోగ మైనను నీ మహిమేగా!
స్థల శిలా భోగముల నెలవుందువు నీవేగా! "అత్తి"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link