Bangarupadala

బంగారు పాదాల
"పల్లవి": బంగారు పాదాల పాద పద్మారాధన
శృంగార రాయనికి స్వర్ణ పుష్పార్చన "2"
"చరణం": అంగరంగ వైభవాల సహస్రనామార్చన
రంగురంగు సంర్రంభాల స్వరార్చ నామాల "2"
రంగనాయకునకు అల బ్రహ్మదేవుని
రంగారు సింగారాల బంగారు అర్చన "బంగారు"
"చరణం": అంగ అంగాంగ శోభ బహు యింపారు శోభ
ఘన సారంగపాణికి సౌమ్యమైన శోభ
సురాంగణల గానాల సుస్వరాల శోభ
సురలోక నాయకునకు సుప్రభాత శోభ "బంగారు"
"చరణం": అభ్యంగ స్నానాల అసమాన సమావర్త
అభిజిత్ ముహూర్తాన అందుకోవా మా జోత "2"
అచ్చెరువొందే సేవల కొండల కోనేటిరాయా!
సచ్చరితుల పాలి నీవు సత్యదేవుడవయ్యా! "బంగారు"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link