Intidonganu

LYRICS:
ఇంటిదొంగను
"పల్లవి": ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడట, ఆ
ఇంటిదొంగను పట్టించే ఈశ్వరుడే తానంట "2"
"అ.ప.": ఒంటిలోని మాలిన్యమును తొలగించే ఔషధమంట
మన ఇంటిలోని మాధుర్యమును తొలగనివ్వని సౌరభమంట "ఇంటి"
"చరణం": సకల పోషణ కారణము నిక్కముగా నీ మనసేనంట
సకల మానసవికాసము ఆధారమె నీ మనసంట
ఆలోచనలను వెల్లువకు ఆనకట్ట నీ యోచనయంట
ఆనకట్టలేని నీ మనసే అనర్ధములకు వారధియంట "ఇంటి"
"చరణం": మోక్షగామిగా మననినాడు బ్రతుకే యిక భీతియంట
భక్తియను వారధిని జేసుకొనుటయే రీతియంట "2"
మనసను కళ్ళెము నీ కరముననే యుండునంట
అల మాధవుడను మత్తేభము నీ కళ్ళెము నాపునంట "ఇంటి"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link