Kshirambudhilo

KSHIRAMBUDHILO
పల్లవి: క్షీరాంబుధిలో, క్షీరప్రియుండు
కొలువైయున్నాడు, స్వామిని చూడరొజనులాలా [2]
చరణం: చక్కదనముతోడ, చక్ర ధరియె వాడు
చక్కని తల్లి ప్రియ చెంగల్వె వాడు [2]
చక్కని, చిక్కని నగవుల ఱేడు
చక్కనయ్యా! అని పొగడరే మీరు [2]
చక్కనయ్యా! అని పొగడరే జనులాలా [క్షీరాంబుధి]
చరణం: చెక్కిలి, చెక్కుల, తళుకు బెళుకు వాడు
చుక్కానిగ మము నడిపించువాడు [2]
చుక్కల నింగిన, చల్లని ఱేడు
చల్లనయ్యా అని పిలువరే మీరు [2]
చల్లనయ్యా అనిపిలువరే జనులాలా [క్షీరాంబుధి]
చరణం: రమకు విభుడె వాడు రమణీ ప్రియవాడు
రసాంబుధిలో ఓల లాడించువాడు [2]
రసరమ్యముల గాన లోలుడె వాడు
రాధా లోలాయని పాడరె మీరు [2]
రాధా లోలా యని పాడరె జనులాలా [క్షీరాంబుధి]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link