Ma Manasamu

MAA MAANASAMU
పల్లవి: మామానసము, బృందావనము
మా పాలకుడు, ఆ గోపాలుడే "2"
చరణం: మానస తోటలో కల్మషమను కలుపును
తొలగించు మానస చోరుడు
బేధములు మాపి, భావము తోడనే
బంధములు పెనవేయు భాగవతోత్తముడు
మంచి మనసులను, విత్తనములనునాటి
గెలచి, నిలచినవాడు, గోకులనందనుడు, గోవిందుడు "మా"
చరణం: బేధభావమ్ములు విడనాడేనట
ఒక త్రాటిన చేర్చిన మహీపాలుడు
భవ బంధమ్ములు విడిపించేనట
అవతారమూర్తీ, ఘనతార కీర్తీ
బేధరహితుడు, భూతభావనుడు వాడు
గరుడారూఢు, ఘనశ్యాముడు, గోవిందుడు గోపాలుడే "మా"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link