Maa Thalli

MAA THALLI
పల్లవి: మా తల్లి అలమేలు మంగ
శ్రీపతి సరసన, నువు నడయాడంగ "2"
చరణం: వన భ్రమరమ్ములు, నల్లని కురులు
ముగ్ధ సోయగపు, ముసిముసినగవులు "2"
పచ్చల హారములు, పీతాంబరము "2"
మణిమయ హారముల, చందనగంధి "మా తల్లి" "2"
చరణం: పలుకుల సొలపులు, మృదు మధురమ్ములు
ప్రాత: కాలపు, కోయిల స్వరములు "2"
పసిడి మువ్వల, సరిసవ్వడులు "2"
సంధ్యా రాగపు సరిగమల ఝురులతో "మా తల్లి"
చరణం: వేంకట రమణుని, పట్టపురాణివి
హృదయము నందున వెలసిన, ఘన అలివేణివి "2"
సకల ప్రసాదిని, సద్గుణ వర్షిణి "2"
వైకుంఠుని ప్రియ గారాల భరణివి "మా తల్లి"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link