Namokesavatchuta

NAMOKESAVATCHUTA
పల్లవి: నమో, కేశవాచ్యుతా నమో! నారసింహా
నమో! పుండరీక వరద నమో! పరమ పురుషా "నమో"
చరణం: లోకము లెల్లను ఏలగ లోకనాధుండీతడు "2"
మకరము బారిన బడి శరణు జొచ్చిన కరిని "2"
వరదవై, కరుణ జూపి కాపాడిన ఏలికా "నమో"
చరణం: సరసిజనయనుడె మనలను సర్వ విధమ్ముల గాచును "2"
లోకాభి రాముడై, శోకములను బాపేను "2"
సకల సుఖమ్ముల కీతడు సాక్షిభూతుడై నిలచు "నమో"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link