Navadurga

NAVADURGA
పల్లవి: నవ దుర్గవుగా రావమ్మా నవ నిధులను కురిపించమ్మా "2"
నవ్య కాంతులతో వెలుగొందే నటరాజ రాణీ నీవమ్మా "నవ" "2"
చరణం: కైలాస నగముల రాణివిలే కైలాసుని ప్రియ సతి వేలే
కామిత ఫలములు దీరునులే కామాక్షీ! నిన్ను గొలువగనే
కర్కసులను, నువు దండించి కనక రాసులను కురిపించితివి
కన్యకగా నీవు, విలసిల్లి కాత్యాయనిగా వెలసితివమ్మా
దామోదరునకు సోదరివే దుండగులకు నువు, సింహస్వప్నమె
దక్షుని తనయగ జనియించి దాక్షాయణిగా వెలసితివమ్మా "నవ"
చరణం: సంతాన భాగ్యమును కలిగించే సంతానలక్ష్మివి నీవేలే!
సత్వరముగ మాగృహములకు సంతసమున వేంచేయగ! రావే
సుందరేశునీ కామినిగా మధురలోన నువు వెలిశావమ్మా!
సుందర సుమముల పూజించి మందహాసముల
మ్రొక్కెదమమ్మా! ఆదిలక్ష్మిగ వసగితివి
ఆయురారోగ్య సంపదలు ధనలక్ష్మిగ నువు
మమ్ములను ధనరాసులనే గుప్పితివమ్మా! "నవ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link