Neelalitha

NEE LALITHA
పల్లవి: నీ లలిత చరణములు పోలిన
మృదుపాద కమలమ్ములు [2]
చరణం: గౌగిలించెడు వేళ సతి సిరినీ
సుమహారములె! మరినీకరములు [2]
దనుజుల దునిమెడి వేళలందున
అవిమారునులె! ఉక్కు సంకెలగ [నీ]
గోళాంతరాళాధిపతిగ నీవు
కానవచ్చేవు, యోగిబృందములకు [2]
వనమాలిగా నీవు కానవచ్చేవులే [2]
బృందావనమున, గోపెమ్మ గన్నుల [నీ]
చరణం: కాన వచ్చేవు! ప్రణయ రూపునిగ
చేపట్టెడి వేళల, కన్యకరుక్మిణిని [2]
భక్త వరదగ, కానవచ్చేవులే [2]
కరిప్రాణమ్ములు రక్షించువేళల [నీ]
చతుర్భుజములతొ, శంఖ చక్రధరుడై
కానవచ్చేవులే! చిన్మయరూపునిగ
నాభిన, చతురాననుని సృష్టించిన, నిను [2]
గొలుతురే, ప్రభూ! పద్మనాభునిగ [నీ ]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link