Neelimeghapu

Neelimeghapu
పల్లవి: నీలిమేఘపుఛాయనీలోత్పలుడు
నీలిఆకసమంతా అడుగైనఱేడు [2]
అ.ప: నందగోకులమున నేరేడుపండు
నందబాలుడెవాడు నారాయణుడు [నీలి]
చరణం: తెల్లనిఛాయగల క్షీరసాగరమున
కర్పూరపుపండు కమలనాధుడెవాడు [2]
పీతాంబరములొ కాంతులీనెడువాడు
దామోదరుడు దేశిమామిడిపండు [నీలి]
చరణం: ముత్యపుబారుల పలువరుసవాడు
నొక్కుకేశముల పసిపనసయెవాడు [2]
సిరిని వక్షమున నిలిపిన ఱేడు
భూసురపక్షమున నిలిచినవాడు [నీలి]
చరణం: విశ్వమంతటయున్న ముంతమామిడిపండు
మధురామృతతొనల కమలాఫలమెవాడు [2]
బ్రహ్మను నాభిన సృష్టించిన ఫలము
బ్రహ్మండములలోన నారికేళమేవాడు [నీలి]
చరణం: అన్నిఫలములలోనూ యున్నదితానే
మిన్నఫలములనే అందించునుతానే [2]
పదునాల్గుభువనముల పగడమైవెలుగొందు
పదసోపానమున పుష్యరాగమైనాడు [నీలి]
2 Comments



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link