O Bojja Ganapayya

జై జై గణేశా జై జై
జై జై గణేశా జై జై
జై జై గణేశా జై జై
జై జై గణేశా జై జై

ఓ బొజ్జ గణపయ్య, నీ సాటి ఎవరయ్య
నీ పోటి లేరయ్య
ఓ బొజ్జ గణపయ్య, నీ సాటి ఎవరయ్య
నీ పోటి లేరయ్య

సురలోకములో, సురల నుతులను అందుకొనుచూ నీవు సంతసమందేవు
ఈ భూలోకములో మాపాట్లు, ఇక్కట్లు కనలేవా, ఓ స్వామి
ఉండ్రాళ్ళనిన, బహు ప్రీతిలే నీకు
బ్రహ్మాండమునూ, బొజ్జలో దాచితివి నీవు
కుడుములు, భక్షములు, మనసార భుజియించి
కుడుములు, భక్షములు, మనసార భుజియించి
కోర్కెలీడేరగా, వరముల నొసగేవు

ఓ బొజ్జ గణపయ్య, నీ సాటి ఎవరయ్య
నీ పోటి లేరయ్య
ఓ బొజ్జ గణపయ్య, నీ సాటి ఎవరయ్య
నీ పోటి లేరయ్య

భుక్తాయాసముతో, ప్రయాసపడు నిన్నుజూచి సోముడు నవ్వాడులే
అంత సతీదేవి శాపమొసగె అతని గనిన జనులు అపనింద పాలు అగునని
నీ కధను విని నంతనె సర్వ లోకమ్ములు
బడయునంట, సౌభాగ్య సిరి సంపదలు
బాధ్రపదపు చవితినాడు, నిను గొలిచిన వారికి
బాధ్రపదపు చవితినాడు, నిను గొలిచిన వారికి
తీరునులే వారికి సర్వాభీష్టములు

ఓ బొజ్జ గణపయ్య, నీ సాటి ఎవరయ్య
నీ పోటి లేరయ్య
ఓ బొజ్జ గణపయ్య, నీ సాటి ఎవరయ్య
నీ పోటి లేరయ్య

జై జై గణేశా జై జై
జై జై గణేశా జై జై
జై జై గణేశా జై జై
జై జై గణేశా జై జై



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link