Pari Pari Vidhamula

PARI PARI VIDHAMULA
పల్లవి: పరి పరి విధముల, పలు రూపమ్ముల "2"
పరిచయ మాయెను, పరమాత్మ "2"
చరణం: తండ్రి ఆనతిని, జవదాటని వాడుగ "2"
రాజసమునకు, తను మారు రూపునిగ "2"
వేదములు గాపాడ, అసురుల నంతము జేసి "2"
వేదనారాయణుడు, పరంధాముడు "పరి పరి"
చరణం: బలితాపము నణచు, వామన మూర్తిగ
ధరణిని గాచేటి, వరాహ రూపునిగ
కంసాది అసురుల పాలిటి, అనంతునిగ
కలి యుగమున మాగోవిందునిగ "పరి పరి" "2"
చరణం: పట్టు బట్టి, ఈ జగములు గాచు వాడుగ "2"
తన పట్టుతోడ, దనుజుల దునిమెను "2"
పట్టము గట్టి, మనల నాదరించునుగా "2"
పదార్ధమై తాను, ఇలనడిపించును "పరి పరి"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link