Phalamu

PHALAMU
పల్లవి: ఫలము, పుష్పము, పత్రము, తోయము
ఏదైనను, నాస్వామి, చిరునగవులు చిందించు "2"
అ.ప: సర్వాయుధిని మనసున నిలుపుము "2"
తనకు అదియే నిజమైన అర్చనము "ఫలము"
చరణం: కొండంత స్వర్ణ భాండమైనను
కానగ, చిరుకానుక అయిననూ "2"
ఏదైనను, తారతమ్యములు లేవులే!
ఎవరి కైనను, వసుడగున లే! "ఫలము"
చరణం: భూపాలురు, మరియు పామరులు
కడు బీదలు, ఘన కామందులు "2"
ఎవరైనను, ఎవరి చేత నైనను
సమసేవల సముడు, నగధరుడు "ఫలము"
చరణం: భావమె గాని, ధన సంపత్తి కాదని
తర తమ బేధమే లేదని "2"
ఎవరు సర్వ మర్పించి కొలుతురో "2"
పరదైవము, వారిమదిన కొలువగును "ఫలము"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link