Hari Govinda

HARI GOVINDA
పల్లవి: హరిగోవింద, గోవింద
భజ గోవింద, గోవింద "2"
చరణం: వనరాజైన, మృగ రాజైనను
ఆకలి గొనినంత, కోరునాహారము "2"
మరి, మానవులు, "తృష్ణ" యను ఆకలి
కలుగ, లోకమునే భుజియింతురే! "హరి" "2"
చరణం: కాలకూటమగు విషమును జిమ్మెడు
కాలనాగైనను, గళమున మెరిసెనే "2"
మనుజులేల మెలుగక శాంతము "2"
క్రోధమను విషమును గ్రక్కెదరుగా! "హరి"
చరణం: కొండను జుట్టిన, కొండ చిలువైనను
దరి చేరిన దానినె, భుజియించును "2"
మరి మనుజుడేల, అందినది వదలును "2"
అందని దానికై యత్నించును "హరి"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link