Hari Smaranaye

HARI SMARANAYE
పల్లవి: హరి స్మరణయే, భువిన పరమౌషదము
హరి చరణములను, గొలువుము నిరతము [హరి]
చరణం: జని యించినది మొదలు, సుఖ దుఃఖములను
జీవన డోలలో, ఊయలూగితి [2]
నింగి కెగరితి, నేలను జేరితి
తలచితి నన్నియు, ప్రసాదములుగ [హరి]
చరణం: ఇహ కర్మంబుల గడచె కాలము
వ్యర్ధ భాషణల, నిష్ఫలము సమయము [2]
దౌడు గుర్రములా జేసితి పయనము
ఇటునటు బరుగులు, జీవిత మంతయు [హరి]
చరణం: నీవు సమీపింప, అవసాన దశలందు
మరలించు మదిని, మధుసూదుని యెడ [2]
ఘడియైనను జాలు, పొందుటకు నీవు
దివ్య చరణములు, ద్వారములు దెరువగ [హరి]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link