Harinaamamu

HARINAAMAMU
పల్లవి: హరి నామము శ్రీ హరి నామము
అ.ప: పావన నామము కడు రమ్యము [2]
చరణం: పలుకుము నామము సుళువగును మార్గము [2]
పలుకు పలుకులయందు హరి నామమును నింపు [హరి]
చక్కని నామము చుక్కాని యీ నామం [2]
చుక్కెదురైనను నిను చక్కగ దరి జేర్చును [హరి]
చరణం: తరుణో పాయము యీ శుభ నామము
అరుణారుణ వేళల భజియింపు నామము [2]
కరుణ రసములు నిండిన నామము
పరమ పదమునకు యిది మన కుడి భుజము [హరి]
చరణం: అతియును గతియును యీ పుణ్యనామము
ఆత్మా నందము పొందును మనము [2]
ఆద్యంతములైన శ్రీ హరి నామము
తన్మయత్వమున మనసు పులకితము [హరి]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link