Jagamerigina

జగమెరిగిన
పల్లవి: జగ మెరిగినవానికి, జంధ్యమెందుకు,
హరినితలచుటకు, నీకుయోచనెందుకు [2]
అ.ప: యోజనదూరము, నీకుయందుకని [2]
నీమానసమున నిలుపుము, ఆతనిని [జగమెరిగిన]
చరణం: చదువూసంపదలు, లోకములేలుటకు [2]
భక్తిసంపద, భాగవతోత్తముని కొలచుటకు [2]
అజ్ఞానతిమిరములు, పారద్రోలెడివాడు [2]
సర్వేశ్వరుడొకడే, జగమేలు వాడు [2] [జగమెరిగిన]
చరణం: ఘనకీర్తి కాములు, పదవులు యేలిననూ [2]
పెదవిన, శ్రీహరి పదమొకటే చాలును [2]
పదహారు కళల నాధుడు, పద్మనాభుడితడు [2]
పదాంబుజముల రజ మొకటే చాలును [2] [జగమెరిగిన]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link