Manasu Ane

మనసు అనే
"పల్లవి": మనసు అనే తాళంచెవి నీవద్ద యున్నపుడు నీ
హృదయమను గృహము యిక మూసివేయబడదులే! "2"
"అ.ప.": చోరులు మరి దుండగులను చెడుయోచనలు
పట్టివేయమని నీ మనసు హెచ్చరించును "మనసు"
"చరణం": కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము
ఆమనిలా నిన్ను అడగకుండ ప్రవేశము
సందేహమను తలుపులను తీసిమూసివేయును
తికమకలు చేయును ముంచివేయు తింగరినీ జేయును "మనసు"
"చరణం": చోరులు ఎందరు చుట్టిన నీ హృదయము మరి భద్రము
చరాచరునికే మిత్రమా! స్వాగతము పలుకుము
చాలును ఆ విభునికి నీ హృదయమనే గృహము
హృదయప్రాకారానికి తానే ఆదియునంత్యము "మనసు"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link