Manasu Ane Udyanavanamuna

మనసు అనే ఉద్యానవనమున
"పల్లవి": మనసు అనే ఉద్యాన వనమున, యిల
"మనిషి" యనే తోటమాలి యొకడు "2"
"అ.ప.": అక్షరమను విత్తనములు జల్లెను "2"
అవి మాటలుగా మొలకెత్తెను సంతసమొందెను "మనసు"
"చరణం": మాటలను తెచ్చెను, మూటలను గట్టెను
ఏమిచేయాలో తనకు తోచదాయెను "2"
మంచిమాటలతొ మనము మంచిని పంచవలెను
మంచిధాన్యముగనవి ఉపయోగము గావలెను మనసు"
"చరణం": క్షేత్రమను లోకమున పరమాత్ముని గాంచుమా!
ధాన్యమను పదములను యాతని కంకితమీయుమా!
కీర్తన యను ధాన్యరాశితో నీవు వండుమా! ఆ
దేవదేవునికి తృప్తిగ కడుపు నింపుమా! "మనసు"
"చరణం": నగధరుని ఆజ్ఞ లేని నగుమోము గానము, ఆతడి
అనుజ్ఞలేని జన్మము కానగ కాననము "2"
మహిమోపేతములే మహీధరుని మహిమలు
మోహనాశములు, అతడు కురిపించు నగవులు "మనసు"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link