Naa Manasame

నా మానసమే
"పల్లవి": నా మానసమే వూయల, పసిపాపడవై వూగేవు
ఆడుతు పాడుతు తిరిగినను పరవశింపజేశేవు "2'
"చరణం": నీ బోసినవ్వులు నను మైమరపించే
ఆకలిదప్పులు గురుతు సేయబోవులే!
నీ కిలకిలల అమృతమే నాదప్పికను దీర్చునులే!
నీ పలుకుల పరమాన్నం నాకడుపును నింపునులే "నా మనసే"
"చరణం": నీ అడుగు తడబాటే నను సరిజేయునులే!
నీ వురుకు పరుగులే నా యోచనలే!
నీ లేత జేవేళు అర్చింప చిహ్నములే! "2"
నీ పవళింపు స్థానమే నా వైకుంఠధామమే "నా మనసే"
"చరణం": నీ తొలిఅడుగు ఆకాశమంత ఆనందం
నీ మలిఅడుగు పుడమియే పులకితము
నీ అడుగులా నా అడుగు ఆనందం "2"
ఆనందనందనా! నా ప్రతిఅడుగు నీ మయమే "నా మనసే"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link