Pasipaapadi

పసిపాపడి నగవు
"పల్లవి": పసిపాపడి వంటి నగవు పసి నిమ్మపండు నగవు
వసివాడని నవ్వు మిసి మిసి రవ్వలు రువ్వు "పసి"
"చరణం": జగముల నేలే నగవు జలతారు వంటినగవు
జగన్నాయకుని నగవు జాబిలి నవ్వు "2"
జలజనయనుని నగవు జలపాతం నగవు
జల జల ముత్యాలు నేల జాలువారు నగవు "పసి"
"చరణం": సర్వ శుభముల నగవు శుభాశీశ్శుల నగవు
సూర్య కాంతి నగవు సొంపైన నవ్వు "2"
చంద్రుని వంటి నగవు శిశిరకాంతి నగవు
శిశుపాలుని మర్దించి లోకము గాచిన నగవు "పసి"
"చరణం": రుక్మిణమ్మ మనము దోచి దోబూచు లాడేనగవు
రుక్మి గుండెలలోన గర్జన నగవు "2"
రివ్వున విరులే రువ్వు, మెల్లని ఆ నవ్వు
అవురా! జగమే గాచే జిగేలుమను నవ్వు " పసి"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link