Ramalali

YRICS:
రామలాలీ
"పల్లవి": "రామలాలీ" అనుచు సునయన జోలతోన
రాముని తలపులునింపే సీతమ్మ మదిలోన "2"
"అ.ప": రాముని కొరకై మరి జనియించె సీతమ్మ
రామాయణమే ఇక ఫలవంతము ధరలోన "రామ"
"చరణం": ఉగ్గుపాలతోడ నిండె ధరణిజ డెందములోన, ఆ
రఘువంశ యగ్రజుడే తనవాడను త్రికరణ శుద్ధితోన
దిగ్గజమై విహరించెను సీతమ్మ కలలలోన
అద్గదిగో విహంగమాయె మానస సరస్సులోన "రామ"
"చరణం": ఏమైననూ యాతడే తనవాడగు రీతిలోన
ఆమనిగా వచ్చి తన మనస్సును పువ్వుల నావలోన
తీరమునే జేర్చునుగా! తియ్యని బంధముతోన
పూతేనెల దారమై అల్లునుగా తనమనసుతోన "రామ"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link