Rayilonaneeve

రాయిలోన నీవే
"పల్లవి": రాయిలోన నీవే, ప్రతిస్థాయిలోను నీవే
వేయినామాల స్వామి! రేయ్యింబవళులు నీవే! "2"
"చరణం": కొండలలో నీవే, మా డెందములో నీవే!
కొండలనన్నింటిలోన ఏడుకొండలు నీవే!
ఫలములలో నీవే, ప్రతిఫలమైనను నీవే!
ఫలసముదాయములలో తియ్యందనము నీవే! "రాయిలోన"
"చరణం": రేణువులో నీవే! వేణువులో నీవే!
ప్రాణాధారమైన నీరములో నీవే
అంతరాత్మలలో అమృతము నీవే!
ఆత్మజ్యోతివి నీవే, అంతర్యామివి నీవే! "రాయిలోన"
"చరణం": తరువులలో నీవే! ప్రతి మేరువులో నీవే!
మేరువులన్నింటిలోన వేంకట మేరువుయొకటే!
జీవులలో నీవే! చిరంజీవివైనావే!
పరంజ్యోతిగా వెలిగే పరంధాముడవు నీవే! "రాయిలోన"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link