Settu Puttaku

సెట్టూ పుట్టకు
"పల్లవి": సెట్టూ పుట్టకు కారణమంట
సెట్టంత దైవము తానె యంట "2"
"అ.ప.": పట్టినపట్టు యిడువడంట
మనల పట్టభుధ్రులను సేయునంట "సెట్టూ"
"చరణం": ఆడను ఈడను ఆవరించునంట
ఆడుతు పాడుతు బతుకమంటడoట "2"
ఆడేగా మన తోడు యంట
వీడడుగా మరి జనమల సివరగ "సెట్టూ"
"చరణం": మదిలో నుండగ భయము యేలరా! మరి
బదులుగ తాను ఏ మడుగడురా! "2"
మదముతొ నీవు మాట మీరినను
ముదముతొ నిన్ను కడతేర్చునురా! "సెట్టూ"
"చరణం": జలజనేత్రి తోడు తానె యంట!
జలములొ నెపుడు కొలువుండునంట "2"
జలజల కన్నీరు గార్చిన నీవు
జాలమువలె నిన్ను అల్లుకొనునుగా! "సెట్టూ"
"చరణం": వైకుంఠము మరి యేడొ లేదురా! తాను
అంటి యుండునదె వైకుంఠమేరా! "2"
జంటగ నీకు వాడుయుండిన
ఒంటిరాయివి గానే గాదురా! "సెట్టూ"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link